శ్రీకాళహస్తిలో కన్నుల పండుగగా ఆది దంపతుల కళ్యాణం

Srikalahasti: ఘనంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడి కళ్యాణం

Jyothi
Published on: 11 March 2024 12:18 PM IST
The Marriage Of Aadi Dampatulu In Srikalahasti
X

శ్రీకాళహస్తిలో కన్నుల పండుగగా ఆది దంపతుల కళ్యాణం

Srikalahasti: జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తిలో పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణం మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ కన్నుల పండగగా జరిగింది. కళ్యాణ వేదికకు స్వామి గజ వాహనంపై ఊరేగింపుగా బయలుదేరగా.. అమ్మవారు మణిమయ, రత్న గోమేధీకాభరణాలు అలంకరించుకొని సింహ వాహనంపై పెళ్లి మండపం వద్దకు పయనమైంది.

ప్రధానార్చకుల మంత్ర పఠనం పవిత్రమై సాగింది. ప్రధాన పురోహితుడి ద్వారా అమ్మవారి మెడలో స్వామివారు మంగళ సూత్రధారణ చేయడంతో ఆదిదంపతుల కళ్యాణ మహోత్సవం ముగిసింది. జగత్కారకులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చూసి భక్తజనం పులకించారు. ఇదే శుభముహూర్తంగా భావించి పలు జంటలు ఒకటయ్యాయి.

Jyothi

Jyothi

Next Story