YCP: వైసీపీ ఇన్‌చార్జ్‌ల మార్పుల జాబితా ఆలస్యమయ్యే ఛాన్స్
YCP: పలు స్థానాల్లో మార్పులపై కొనసాగుతున్న కసరత్తు
YCP: వైసీపీ ఇన్‌చార్జ్‌ల మార్పుల జాబితా ఆలస్యమయ్యే ఛాన్స్
YCP: అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల మార్పులపై ఫోకస్ పెట్టిన వైసీపీ అధిష్టానం వారి జాబితాను ప్రకటించేందుకు కొంత వేచి చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కొన్ని స్థానాల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. అయితే పార్టీలోకి కొత్త నేతల చేరికల తర్వాతనే మార్పులు చేర్పులపై ఫైనల్ డెసిషన్ ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కొత్తవారికి అవకాశం ఇచ్చే ఆలోచనతోనే పలు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల మార్పులను వైసీపీ అధిష్టానం పెండింగ్‌లో పెట్టినట్లు టాక్. దీంతో కొత్త నేతల చేరికతో రెండో జాబితా ప్రకటన ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు త్వరలోనే కొత్త నేతలు పార్టీలో చేరనున్నట్లు ప్రచారం స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే మలివిడత జాబితాను జనవరి 2న ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
Next Story




