KK Survey: ఏపీలో కేకపుట్టించిన కేకే సర్వే.. కూటమి సునామీని ఊహించిన ఒకే ఒక్కడు..

KK Survey: కేకే. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఈ పేరు మార్మోగిపోతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 4 Jun 2024 3:09 PM IST
The KK survey that is making noise in AP The KK survey was predicted in advance
X

KK Survey: ఏపీలో కేకపుట్టించిన కేకే సర్వే.. కూటమి సునామీని ఊహించిన ఒకే ఒక్కడు..

KK Survey: కేకే. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఈ పేరు మార్మోగిపోతోంది. ఎవరి నోటా విన్నా కేకే మాటనే. పెద్ద పెద్ద సర్వే సంస్థలకు కూడా సాధ్యం కాని తరహాలో ఎగ్జిట్ పోల్స్‌ను అంచానా వేసి.. కేక అని అనిపించుకున్నారు. కేకే సర్వే ఒక్కటే ఏపీలో కూటమి సునామీని ముందే ఊహించి ఎగ్జాక్ట్ పోల్స్‌ను వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీకి కూటమికి 161 సీట్లు వస్తాయని కేకే అంచనా వేయగా.. ఆ సర్వే చెప్పినట్టే కూటమి ప్రభంజనం దిశగా దూసుకుపోతోంది. 155కిపైనే అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ 175 స్థానాలకు కేవలం 14 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని కేకే సర్వే పేర్కొనగా అప్పుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. కానీ ఫైనల్‌గా కేకే సర్వే అంచనాలే నిజమయ్యాయి.

ఇప్పుడే కాదు 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జాక్ట్ పోల్‌ను వెల్లడించారు ఆయన. వైసీపీకి 150కి సీట్లు వస్తాయని చెప్పగా.. ఆయన అంచనా వేసినట్టే గత ఎన్నికల్లో వైసీపీ సునామీ వచ్చింది. ఇప్పుడు భారీ మెజార్టీతో కూటమి గెలుస్తుందని చెప్పగా అదే నిజమైంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story