కాకినాడ బీచ్ రోడ్‌లో రాకపోకలు నిలిపివేత

*మాయపట్నం, సూరాడపేట, పల్లిపేట, కొత్తపట్నం... తీరంలో దెబ్బతింటున్న మత్స్యకారుల ఇళ్లు

Rama Rao
Updated on: 10 May 2022 9:01 AM IST
The impending threat of the Asani Cyclone cyclone to Kakinada
X

కాకినాడ బీచ్ రోడ్‌లో రాకపోకలు నిలిపివేత 

Kakinada: అసాని తుపాను ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంట కెరటాలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ బీచ్ రోడ్‌లో రాకపోకలు నిలిపివేశారు. సాగర కెరటాలు మత్స్యకారుల ఇళ్లల్లోకి దూసుకువస్తున్నాయి. మాయాపట్నం, సూరాడపేట, పల్లిపేట, కొత్తపట్నం తీరంలో మత్స్యకారుల ఇళ్లు దెబ్బతిన్నాయి. నిన్న సాయంత్రం ఉప్పాడ తీరానికి సరుకు రవాణా చేసే స్టీల్ బర్జ్ కొట్టుకు వచ్చింది. కాకినాడ పోర్టు నుంచి బంగ్లాదేశ్‌కు భవన నిర్మాణ రాళ్లను బార్జ్ తీసుకెళ్తుండగా తీరానికి కొట్టుకు వచ్చింది.

Rama Rao

Rama Rao

Next Story