Chandrababu: ఐఆర్ఆర్‌ కేసులో బాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

Chandrababu: ఇసుక పథకం కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌

Shekhar G
Published on: 7 Nov 2023 6:47 PM IST
The Hearing on Chandrababu anticipatory bail in the IRR case has been postponed
X

Chandrababu: ఐఆర్ఆర్‌ కేసులో బాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా 

Chandrababu: రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నందున ఆ గడువు వరకు ఆయనను అరెస్టు చేయబోమని ఏజీ కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ స్పూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. తొందరపాటు చర్యలేమీ తీసుకునే ఉద్దేశం లేదని ఏజీ తెలిపారు. మరోవైపు ఉచిత ఇసుక పథకంపై సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఉచిత ఇసుక పథకం పేరుతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చారనే ఆరోపణలతో APMDC డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది.

Shekhar G

Shekhar G

Next Story