Pawan Kalyan: రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలి

Pawan Kalyan: బూతులు తిట్టి, దాడులు చేసే మంత్రులు వైసీపీ కేబినెట్‌లో ఉన్నారు

Shashank Gullapelli
Published on: 10 April 2024 9:39 PM IST
The Government That Made The Farmer Cry Should Be Wiped Out Says Pawan Kalyan
X

Pawan Kalyan: రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలి

Pawan Kalyan: రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచి పెట్టుకుపోవాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబుతో కలిసి పవన్ పాల్గొన్నారు. బూతులు తిట్టి, దాడులు చేసే మంత్రులు వైసీపీ కేబినెట్ లో ఉన్నారని మండిపడ్డారు. ఆంద్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని పొత్తు పెట్టుకున్నామన్నారు. ప్రజల భవిష్యత్ కోసం రోడ్లపైకి వచ్చి కొట్లాడాల్సి వచ్చిందన్నారు. దోచుకున్న డబ్బుతో మరో చోట పరిశ్రమలు పెట్టుకుంటున్నారని.. ఇక్కడ పెట్టినా యువతకు ఉపాధి అవకాశాలు లభించేవన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story