AP HighCourt: జీవో నెం.1పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

AP HighCourt: జీవో నెం.1పై తాత్కాలిక సస్పెన్షన్ గడువు ముగుస్తుందన్న పిటిషనర్లు

Dhatripriya
Updated on: 23 Jan 2023 7:30 PM IST
The GO No 1 in the High Court has been adjourned till tomorrow
X

 AP HighCourt: జీవో నెం.1పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

AP HighCourt: జీవో నంబర్‌ 1పై విచారణను రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్​పై విచారణ చేపట్టగా సీజే ధర్మాసనం ఎదుట పిటిషనర్లు, ఏజీ, ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు. జీవో నెంబర్ 1పై తాత్కాలిక సస్పెన్షన్ గడువు ముగుస్తుందన్న పిటిషనర్లు కొత్తగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే కొత్తగా ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు రేపు ఫైనల్ ఆర్డర్ ఇస్తామని తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది. జీవో నెంబర్ 1పై హైకోర్టులో రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. మరోవైపు టీడీపీ నేత కొల్లు రవీంద్ర, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఇదే అంశంపై పిటిషన్లు దాఖలు చేయగా వారి వాదనలు రేపు వింటామని హైకోర్టు తెలిపింది.

Dhatripriya

Dhatripriya

Next Story