ఏపీలో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలు

* అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌కు సర్వం సిద్ధం * కదిరి డివిజన్‌లోని 12 మండలాల్లో ఎన్నికలు * 163 పంచాయతీ, 999 వార్డులకు పోలింగ్

Sandeep Eggoju
Published on: 8 Feb 2021 11:30 AM IST
The first phase of panchayat elections in AP tomorrow
X

Representational Image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా పంచాయతీ తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కదిరి డివిజన్‌లోని 12 మండలాల్లో రేపు ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 169 పంచాయతీలు, ఒక వేయి 714 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 163 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 715 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 999 వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 12 మండలాల్లో 214 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన అధికారులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story