Nellore: క్షుద్రపూజల పేరుతో తండ్రి దారుణం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి ..

Nellore: మూడేళ్ల చిన్నారి నోట్లో కుంకుమ వేసి.. గొంతు నులిమిన తండ్రి వేణుగోపాల్

Rama Rao
Published on: 16 Jun 2022 11:35 AM IST
The Father Killed the Daughter with Superstition | AP News
X

Nellore: క్షుద్రపూజల పేరుతో తండ్రి దారుణం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి ..

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది. తండ్రి మూఢనమ్మకాలతో కూతురు మృతి చెందింది. మూడేళ్ల చిన్నారి నోట్లో కుంకుమ వేసి గొంతు నులిమేశాడు తండ్రి వేణుగోపాల్. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి. తమ కుటుంబానికి ఏదో చెడు చుట్టుకుందని, అది పోవాలంటే పూజలు చేయాలనుకున్న తండ్రి వేణు తన కన్నకూతురి ప్రాణాలకే ముప్పు తెచ్చాడు. ఒంటిపై పసుపు నీళ్లు పోసి, నోటి నిండా కుంకుమ కుక్కి ఊపిరాడకుండా చేశాడు. దాంతో ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది.

పొక్లెయిన్‌ నిర్వహణతో నష్టపోయిన వేణు బుధవారం తన కవల కుమార్తెల్లో ఒకరైన పునర్విక (3)ను పూజగదిలో పడుకోబెట్టి, భార్యతో పసుపునీళ్లు పోయించాడు. తర్వాత నోట్లో కుంకుమ పోయడంతో ఊపిరాడక బాలిక కేకలు వేసింది. అప్రమత్తమైన స్థానికులు, వేణుగోపాల్‌కు దేహశుద్ధి చేసారు. ఆమెను తొలుత ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు, అక్కడి నుంచి చెన్నైకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

Rama Rao

Rama Rao

Next Story