ఏపీలో శరవేగంగా కొత్త పీఆర్సీ బిల్లులు

AP: జీతాల చెల్లింపు ప్రాసెసింగ్‌కు ఇవాళ డెడ్‌లైన్... వేగం పెంచిన ఆర్థికశాఖ, శరవేగంగా కొత్త పీఆర్సీ బిల్లులు.

Sriveni Erugu
Published on: 31 Jan 2022 11:31 AM IST
The fastest new PRC bills in the AP
X

ఏపీలో శరవేగంగా కొత్త పీఆర్సీ బిల్లులు

AP: ఏపీలో శరవేగంగా కొత్త పీఆర్సీ బిల్లులు రెడీ అవుతున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల చెల్లింపులపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. జీతాల చెల్లింపు ప్రాసెసింగ్‌కు ఇవాళ డెడ్‌లైన్ కావడంతో ఆర్థికశాఖ వేగం పెంచింది. దీంతో ట్రెజరీ ఉద్యోగులు జీతాల బిల్లులు అప్‌లోడ్ చేశారు. శనివారం, ఆదివారం అర్ధరాత్రి వరకు బిల్లులు అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ట్రెజరీల్లో సుమారు 2 లక్షల బిల్లులు కొత్త పీఆర్సీ ప్రకారం సిద్ధం చేశారు. పే అండ్ అకౌంట్స్‌లో 50వేల బిల్లులు ప్రాసెస్ చేసిన అధికారులు. ఆర్థికశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బిల్లులు సిద్ధం చేశారు. ఇక ఇవాళ్టి నుంచి పెన్షనర్ల బిల్లులు రెడీ చేయనున్నారు.


Sriveni Erugu

Sriveni Erugu

Next Story