Nellore: జీజీహెచ్‌లో డాక్టర్ భార్య ఆందోళన.. ఫోన్ లిఫ్ట్ చేయలేదనే కోపంతో హాస్పిటల్‌లోనే వాగ్వాదం

Nellore: టేబుల్‌పై ఫైళ్లను విసిరేస్తూ భర్తపై ఆగ్రహం

Shekhar G
Updated on: 24 Sept 2023 4:15 PM IST
The Doctors Wife Is Worried About Nellore GGH
X

Nellore: జీజీహెచ్‌లో డాక్టర్ భార్య ఆందోళన.. ఫోన్ లిఫ్ట్ చేయలేదనే కోపంతో హాస్పిటల్‌లోనే వాగ్వాదం

Nellore: నెల్లూరు జీజీహెచ్‌లో ఓ డాక్టర్ కుటుంబం వ్యవహారం హాస్పిటల్‌ సెంటర్‌గా రచ్చకెక్కింది. రాత్రి డ్యూటీకి వెళ్లిన డాక్టర్ అయిన భర్తకు భార్య ఫోన్ చేసింది. అయితే తాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదనే కోపంతో నేరుగా హాస్పిటల్‌కే వెళ్లింది. ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయలేదంటూ భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్పిటల్‌లో ఆందోళన చేసింది. తీవ్రంగా స్పందిస్తూ డాక్టర్‌ టేబుల్‌పై ఉన్న ఫైళ్లను విసిరేస్తూ తన కోపాన్ని ప్రదర్శించింది. సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. డాక్టర్‌ ఛాంబర్‌లో తన భార్య చేసిన ప్రవర్తనపై వైద్య సిబ్బంది ఆశ్యర్యంగా చూస్తూ ఉండిపోయారు.

Shekhar G

Shekhar G

Next Story