District Court Granted Bail: జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్

Arun Chilukuri
Published on: 5 Aug 2020 4:20 PM IST
District Court Granted Bail: జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్
X

District Court Granted Bail: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్‌లో ఉన్న వీరిద్దరికి మూడు కేసుల్లో అనంతపురం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. బీఎస్‌-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అలాగే నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేశారన్న అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిపై అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూన్ 13న హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇద్దరిని అనంతపురానికి తరలించారు. రేపు కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story