విశాఖ లో మొదలైన క్రికెట్ సందడి

The cricket commotion that started in Visakhapatnam
x

విశాఖ లో మొదలైన క్రికెట్ సందడి 

Highlights

Visakha: *మొదటి, రెండో టీట్వంటీ మ్యాచుల్లో టీమిండియా పరాజయం

Visakha: విశాఖలో క్రికేట్ సందడి మెదలైంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మూడో టీ-ట్వంటీ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. మూడేళ్ల తర్వాత విశాఖపట్నంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండడంతో మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సోమవారం సాయంత్రమే ఇరు జట్ల క్రీడాకారులు విశాఖ చేరుకున్నారు. సాగర్ నగర్ లోని రాడిషన్ బ్లూ హోటల్ కు ఇరు జట్లు బస చేశాయి. క్రికెటర్లను చూసేందుకు విశాఖ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున క్రీడాభిమానులు తరలివచ్చారు. ఎటు వంటి భద్రత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మ్యాచ్‌ నిర్వాహకులు, పోలీసులు తగు ఏర్పాట్లు చేశారు. పోలీస్‌ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల ద్వారా ఎయిర్‌పోర్టు నుంచి క్రికెటర్లను హోటల్‌కి తరలించారు. మొదట, రెండు టీ20 మ్యాచ్లో ఇండియా ఓడిపోయిన, మూడో మ్యాచ్ లో టీం ఇండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారాంభం కానున్నది.

విశాఖలో జరిగే భారత్ -దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం లోపల వెలుపల 725 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్టేడియం నలుమూలలా సీసీ కెమెరాలతో పాటు కమాండ్ కంట్రోల్, స్టేడియం లోపల ఎనిమిది మందితో ప్రత్యేకంగా బైనాక్యులర్ తో నిఘా ఏర్పాటు చేశారు. మరో వైపు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఫ్లెక్సీలు, జెండా కర్రలు, తినుబండారాలు స్టేడియం లోపలకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. స్టేడియంలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉంచారు.

టీమిండియాకు విశాఖ కలిసొచ్చిన ప్రాంతంగా గుర్తింపు పొందడమే కాకుండా క్రికెటర్లను స్టార్స్ ను చేసిన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు రెండు టెస్టులు, 15 వన్డేలు, రెండు టీ20 మ్యాచులకు విశాఖ ఆతిధ్యమిచ్చింది. టీ మిండియా 90 శాతం విజయాలను నమోదు చేసింది. అంతే కాకుండా టెస్టు, వన్డే, టీ20 మ్యాచ్లో ఇక్కడ భారత్ దేపై చేయిగా నిలిచింది.. ఇక ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కు విశాఖ మరోసారి ఆతిథ్యమిస్తుండటంతో ఖచ్చితంగా భారత్ విజయం సాధిస్తుందని క్రీడా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories