జగన్ సర్కార్, ఎస్‌ఈసీ మధ్య ముదురుతోన్న వివాదం

Arun Chilukuri
Published on: 18 Nov 2020 4:22 PM IST
జగన్ సర్కార్, ఎస్‌ఈసీ మధ్య ముదురుతోన్న వివాదం
X

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌‌ను రద్దు చేసుకున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించేందుకు నిన్న ఎస్‌ఈసీ ఉత్తర్వులిచ్చారు. స్థానిక ఎన్నికలపై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్‌‌లో పాల్గొనాలని సూచించారు. పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ సైతం సమావేశానికి హాజరుకావాలని లేఖ రాశారు. అయితే, ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేనందున అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌‌ అవసరం లేదంటూ ఎస్‌ఈసీకి సీఎస్ లేఖ రాయడంతో నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సీఎస్ అభ్యంతరం తెలుపుతూ లేఖ రాయడంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వీడియో కాన్ఫరెన్స్‌‌ను రద్దు చేసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story