Nara Brahmani: జైల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి

Nara Brahmani: జైల్లో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలేదు

Shekhar G
Updated on: 13 Oct 2023 1:16 PM IST
The Conditions In The Jail Are Very Bad Say Nara Brahmani
X

Nara Brahmani: జైల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి

Nara Brahmani: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కోడలు బ్రాహ్మణి ట్వీట్ చేశారు. రాజమండ్రి జైల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని అన్నారు. చంద్రబాబుకు అత్యవసరంగా వైద్య సేవలు అందించాల్సిన అవసరముందన్నారు బ్రాహ్మణి. చంద్రబాబు ఆరోగ్యంపై మెడికల్ ప్రొఫెషనల్స్ పలు సూచనలు చేశారని అన్నారు. జైల్లో సరైన సమయానికి వైద్య సదుపాయాలు కల్పించడంలేదని ఆరోపించారు. చంద్రబాబుకు ఆరోగ్యంపై తమకు ఆందోళనగా ఉందని ట్వీట్ చేశారు బ్రాహ్మణి.


Shekhar G

Shekhar G

Next Story