ఆర్టీసీ విలీనానికి వేళాయే..!

ఆర్టీసీ విలీనానికి వేళాయే..!
x
Highlights

ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి సంబంధించిన నివేదిక దాదాపు సిద్ధమైంది. ఆదివారంలోపే ఈ నివేదికను ఉన్నతాధికారుల కమిటీ ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ...

ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి సంబంధించిన నివేదిక దాదాపు సిద్ధమైంది. ఆదివారంలోపే ఈ నివేదికను ఉన్నతాధికారుల కమిటీ ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నెల 9 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో విలీనానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఇదంతా అనుకున్నట్టు జరిగితే ముందుగా ప్రకటించినట్లు జనవరి ఒకటిన విలీన ప్రక్రియ పూర్తవుతుంది.

బిల్లు ఆమోదం తర్వాత ఆరీస్టీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి, వారిని కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రజా రవాణాశాఖలో ఉద్యోగులుగా చూపనున్నారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత జీతాలు తగ్గుతాయని, కొన్ని సదుపాయాలు కోల్పోయే అవకాశం ఉందని ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన ఉంది. అయితే జీతాలు తగ్గవని కీలక అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీలో ఉన్న పోస్టులే ప్రజా రవాణాశాఖలో ఉంటాయంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో వేతన సవరణ చేయనుండగా, అది ప్రజా రవాణాశాఖలో చేరే ఆర్టీసీ కార్మికులకు వర్తించడం ద్వారా జీతాలు పెరిగే వీలుందని అంటున్నారు.

ఆర్టీసీ విలీనంపై విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం వివిధ శాఖల ఉన్నతాధికారులతో అక్టోబరులో కమిటీని నియమించింది. ఈ బృందం నేడో, రేపో ఓ నివేదికను ఉన్నతాధికారుల కమిటీకి అందించనుంది. దానిని పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారుల కమిటీ ఆదివారంలోపు ప్రభుత్వానికి తుది నివేదిక అందజేయనున్నట్లు తెలిసింది. ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ఇప్పటి వరకు అయిదుగురు అధికారులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. విలీనం తర్వాత ప్రస్తుతమున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉండవు. ఉద్యోగుల సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories