East Godavari: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పీఎస్ నుంచి నిందితులు పరారీ

East Godavari: జగ్గంపేట పోలీస్‌స్టేషన్‌ నుంచి గంజాయి కేసులో నిందితుల పరారీపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు.

Sandeep Reddy
Updated on: 7 Dec 2021 11:20 AM IST
The Accuseds Absconded from Jaggampet PS in East Godavari District
X

 తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పీఎస్ నుంచి నిందితులు పరారీ( ఫైల్ ఫోటో )

East Godavari: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పోలీస్‌స్టేషన్‌ నుంచి గంజాయి కేసులో నిందితుల పరారీపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. పరారైన ముగ్గురు నిందితుల ఆచూకీ మూడు రోజులైనా దొరక్కపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 2వ తేదీన గండేపల్లి మండలం మల్లేపల్లిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.విచారణ నిమిత్తం జగ్గంపేట పోలీస్టేషన్‌కు తరలించారు. 3వ తేదీ తెల్లవారుజామున తాళాలు పగలగొట్టి నిందితులు పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా జగ్గంపేట పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story