Thammineni Seetharam: ఏపీలో నారా గోటబాయి..చంద్రబాబే

Thammineni Seetharam: చంద్రబాబు హయాంలో లెక్క చూపని డబ్బు ఎక్కడ పెట్టారని ప్రశ్నించారు

Rama Rao
Published on: 21 July 2022 7:35 AM IST
Thammineni Seetharam Comments on Chandrababu
X

Thammineni Seetharam: ఏపీలో నారా గోటబాయి..చంద్రబాబే

Thammineni Seetharam: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 1.62 లక్షల కోట్లకు లెక్కలు చూపమంటే 55 వేల కోట్లకు లెక్కలు చూపిందని కాగ్‌ చెప్పినట్లు కేంద్రం చెప్పిందన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. టీడీపీ ప్రభుత్వం 205 ఆర్టికల్‌ని ఉల్లంఘించిందని కాగ్‌ రిపోర్టులో పేర్కొందని గుర్తు చేశారు. సూడో మేధావులు డబ్బుల పంపిణీ ఆపమంటున్నారని కానీ ప్రజల డబ్బు ప్రజలకు పంచుతున్నాం ఎందుకు ఆపాలన్నారు తమ్మినేని సీతారాం. చంద్రబాబు హయాంలో లెక్క చూపని డబ్బు ఎక్కడ పెట్టారని ప్రశ్నించారు. 1.85 లక్షల కోట్లతో తాము మూడేళ్లలో అనేక పథకాలు పంపిణీచేశామని తెలిపారు. చంద్రబాబులాంటి వారు ఉంటే..మన రాష్ట్రం శ్రీలంక ఎవరో అన్నారని తెలిపారు. ఏపీలో నారా గోటబాయి..చంద్రబాబే అన్నారు స్పీకర్ తమ్మినేని.

Rama Rao

Rama Rao

Next Story