టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..

TG Venkatesh: టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ సీటు ఖాయమంటూ బీజేపీలో ప్రచారం జరుగుతోంది.

Arun Chilukuri
Updated on: 26 May 2022 4:19 PM IST
TG Venkatesh May Get Rajya Sabha Seat
X

టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..

TG Venkatesh: టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ సీటు ఖాయమంటూ బీజేపీలో ప్రచారం జరుగుతోంది. టీజీని యూపీ లేదా కర్నాటక నుంచి పంపించేందుకు పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నేతలపై బీజేపీ ఫోకస్ పెడుతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయ్. రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చేందుకు పార్టీ నిర్ణయించినట్టు కూడా సమాచారం అందుతోంది.

ఏపీ కోటా నుంచి టీజీ వెంకటేష్‌కు అవకాశం ఇచ్చేందుకు పార్టీ నేతలు డిసైడైనట్టు ప్రచారం ఉంది. అదే సమయంలో ఏపీ నుంచి ఇచ్చే సీటును రాయలసీమ నేతకు ఇస్తే పార్టీకి మైలేజ్ వస్తోందన్న భావన కూడా ఉంది. ఏపీ నుంచి రాజ్యసభ రేసులో మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఉండగా మరో నేత పురంధేశ్వరి పేరు కూడా విన్పిస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story