విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్నపోలీసులు..ఉద్రిక్తత!

Arun Chilukuri
Updated on: 1 March 2021 11:29 AM IST
Tension Situation at Renigunta Airport
X

చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో ఉత్కంఠ

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి రేణిగుంటకు బయల్దేరిన చంద్రబాబును ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు పోలీసులు. కరోనా నిబంధనలు, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో సభలు, నిరసనలు, ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు తేల్చిచెప్పారు.

లాంజ్‌ నుంచి బయటకు చంద్రబాబును పోలీసులు అనుమతించకపోవడంతో గంటకు పైగా సమయం నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు చంద్రబాబు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ఎయిర్‌పోర్టుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వారిని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుని హౌస్‌ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story