Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

Sandeep Eggoju
Published on: 17 Sept 2021 1:22 PM IST
Tension Situation at Chandrababu House in Thadepalli
X

చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ పరిస్థితి (ఫైల్ ఇమేజ్)

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం జగన్‌పై చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వారి వ్యాఖ్యలకు నిరసనగా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చారు. చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

తాడేపల్లిలోని కరకట్ట మీద ఉన్నచంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ నెలకొంది. జగన్‌పై చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి వైసీపీ ప్రయత్నం చేయడంతో బుద్ధా వెంకన్న వంటి నేతలు వారిని అడ్డుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ‌్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని జోగి రమేష్ డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పే దాకా చంద్రబాబును, లోకేష్‌ను రాష్ట్రంలో తిరగనివ్వమని ఛాలెంజ్ చేశారు. ఇక పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను సర్దుబాటు చేయడానికి యత్నించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story