చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత

Arun Chilukuri
Published on: 26 Oct 2020 11:48 AM IST
చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత
X

చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేయాలని టీడీపీ నేతలు చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కుప్పం నియోజకవర్గంలో ఎవ్వరికీ ఎలాంటి పాదయాత్రలకు, నిరసన ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథరెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ ర్యాలీకి దిగింది. అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ ర్యాలీలతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పట్టణంలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలకు అనుమతిలేకపోవడంతో పోలీసులు.. కొంతమంది టీడీపీ, వైసీపీ నేతలను హౌస్‌ అరెస్ట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story