ప్రకాశం జిల్లా వాడరేవులో మరోసారి ఉద్రిక్తత

X
Highlights
ప్రకాశం జిల్లా వాడరేవులో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మత్స్యకారులను పరామర్శించేందుకు ఎంపీ మోపిదేవితో పాటు...
Arun Chilukuri14 Dec 2020 10:48 AM GMT
ప్రకాశం జిల్లా వాడరేవులో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మత్స్యకారులను పరామర్శించేందుకు ఎంపీ మోపిదేవితో పాటు ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వెళ్లారు. అయితే ఆమంచి సమక్షంలోనే కఠారివారిపాలెం మత్స్యకారులు తమపై దాడి చేశారని వాడరేవు మత్స్యకారులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆమంచికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ఆమంచి వర్గీయుడిపై దాడికి దిగారు. పోలీసు వాహనాలపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పోలీసు వాహనాల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొనడంతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు.
Web TitleTension prevails at Prakasam beach after fishermen attack each other
Next Story