మందడంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసులకు గ్రామస్తుల సహాయనిరాకరణ

మందడంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసులకు గ్రామస్తుల సహాయనిరాకరణ
x
Highlights

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతిలో ఆందోళనలుకొనసాగుతున్నాయి. నిన్న ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ రైతులు రాజధాని...

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతిలో ఆందోళనలుకొనసాగుతున్నాయి. నిన్న ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ రైతులు రాజధాని బంద్ కు పిలుపునిచ్చారు. మందడంలో బంద్ కొనసాగుతోంది. రైతులు ఉదయాన్నే రోడ్లపైకి చేరుకుని నిరసనకు దిగారు. దీంతో మందడంలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

బందోబస్తుకు వచ్చిన పోలీసులకు నీళ్లు కూడా ఇవ్వకూడదని మందడం గ్రామస్థులు నిర్ణయించారు. గ్రామంలోని దుకాణాల వద్ద పోలీసులు కూర్చోవడానికి కూడా వీల్లేదని రైతులు తెగేసి చెప్పారు. గ్రామంలోకి వెళ్లకుండా పోలీసు వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపించారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. బంద్ చేపట్టిన రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories