ఇదేం కర్మరా బాబు అంటూ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ నిరసన

*వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం

Jyothi
Updated on: 22 Nov 2022 2:18 PM IST
Tension in Yanamalakuduru of Krishna District
X

ఇదేం కర్మరా బాబు అంటూ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ నిరసన

Vijayawada: కృష్ణా జిల్లా యనమలకుదురులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదేం కర్మరా బాబు అంటూ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. అయితే టీడీపీ ర్యాలీని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాము నిరసన ర్యాలీ చేపడతామని టీడీపీ శ్రేణులు చెబుతుండగా.. అడ్డుకొని తీరుతామంటున్నారు వైసీపీ నేతలు.

Jyothi

Jyothi

Next Story