విశాఖ ఏజెన్సీలో మరోసారి అలజడి.. వరుస ఎన్‌కౌంటర్‌లు...

Tension in Visakha Agency Latest News | AP Breaking News
x

విశాఖ ఏజెన్సీలో మరోసారి అలజడి.. వరుస ఎన్‌కౌంటర్‌లు...

Highlights

Visakha Agency: మరోవైపు కీలక ప్రాంతాల్లో పట్టు కోల్పోతున్న మావోయిస్టులు...

Visakha Agency: ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి ఆంధ్రా - ఒరిస్సా బార్డర్ కంచు కోటలా ఉండేది. ఒక అబూజ్ మడ్, జంగల్ మహల్ లాగా పోలీసులు కనీసం కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే పరిస్థితి ఉండేది. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి అందకు భిన్నం. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒకప్పుడు 150 మందికిపైగా మావోయిస్టు దళ సభ్యులు, దాదాపు మూడు నుంచి నాలుగు వరకు ప్రత్యేక దళాలు, అటు అంధ్రా - ఒరిస్సా బోర్డర్ లోని కటాఫ్ ఏరియాతో పాటు ఇటు ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో పనిచేస్తూ ఉండే వారు. అయితే ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందంటున్నారు పోలీసులు.

ఇటీవల కాలంలో వరుస ఎన్‌కౌంటర్లలో చాలామంది మావోయిస్టులు మరణించారు. చలపతి లాంటి నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అదే సమయంలో రాంగూడ ఎన్‌కౌంటర్‌లో విశాఖ ఏజెన్సీకి చెందిన బాకూరి గణేష్ లాంటి నేతలు మృతిచెందారు. ముఖ్యంగా వీరికి పెద్ద దిక్కులా ఉంటూ ఏవోబీని సమన్వయం చేసే ఆగ్రనేత ఆర్కే మరణించడంతో మావోయిస్టు పార్టీకి దిశా నిర్ధేశం కరువైంది.

ఇక ఏజెన్సీలో పోలీసులు దూకుడు పెంచారు. యువత మావోయిస్టుల పట్ల ఆకర్షితులు అవ్వకుండా ప్రచారం చెస్తున్నారు. అటు అంధ్రా ఒడిస్సా పోలీసుల సమన్వయంతో మావోయిస్టు పార్టీపై దాడులు కొనసాగిస్తున్నారు. ఇన్‌ఫార్మర్ల సహాయంతో ఏవోబీలో వరుసగా డంప్‌లు స్వాధీనం చెసుకుంటున్నారు. గత రెండు నెలల్లో దాదాపు 4 డంప్‌లు గుర్తించారు. ఒక వైపు మావోలు ఏజెన్సీలో తమ పట్టును సాధించికోవాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంటే, ప్రజలు మావోలను నమ్మే పరిస్థితి లేదని చెబుతూనే మన్యాన్ని జల్లెడ పడుతూ, గిరిజనుల్లో పోలీసులు చైతన్యం తీసుకువస్తున్నారు. మావోలను జన జీవన స్రవంతిలో కలవాలని పిలపునిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories