విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత

* మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన వార్డు వాలంటీర్లు * రూ.10వేలు జీతం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ * ఒక్కసారిగా వేలాదిగా తరలివచ్చిన వాలంటీర్లు

Sandeep Eggoju
Updated on: 8 Feb 2021 1:51 PM IST
విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత
X

ఫైల్ ఇమేజ్

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ఒక్కసారిగా ముట్టడించారు వార్డు వాలంటీర్లు. 10వేల జీతంతో పాటు, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది ఒక్కసారిగా కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story