శ్రీసత్యసాయి జిల్లా చౌలూరులో ఉద్రిక్తత.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు

రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన పెద్దిరెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

Jyothi
Published on: 11 Oct 2022 12:09 PM IST
Tension in Sri Sathya Sai District
X

శ్రీసత్యసాయి జిల్లా చౌలూరులో ఉద్రిక్తత.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు

Peddireddy Ramachandra Reddy: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం చౌలూరులో హత్యకు గురైన వైసీపీ నేత రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రామకృష్ణారెడ్డి మృతి.. పార్టీకి తీరనిలోటు అని అన్నారు. హిందూపురంలో గతంలో ఎప్పుడూ కూడా హత్యా రాజకీయాలు లేవన్నారు. హత్యకు కారకులెవరైనా సరే.. కఠినంగా శిక్షింపబడతారని చెప్పారు పెద్దిరెడ్డి. అంతకుముందు.. చౌలూరు గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ డౌన్‌.. డౌన్‌.. అంటూ నినాదాలు చేశారు. దీంతో కాన్వాయ్‌ దిగిన మంత్రి పెద్దిరెడ్డి.. బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు.

Jyothi

Jyothi

Next Story