గుంటూరులో మాజీమంత్రి అంబటి వర్సెస్‌ పోలీసులు

గుంటూరులో మాజీమంత్రి అంబటి వర్సెస్‌ పోలీసులు
x

గుంటూరులో మాజీమంత్రి అంబటి వర్సెస్‌ పోలీసులు

Highlights

గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు దిగింది.

గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగా వైసీపీ ర్యాలీలో మాజీమంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. అయితే బారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకునేప్రయత్నం చేశారు పోలీసులు. పోలీసుల తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పట్టాభిపురం సీఐ, అంబటి మధ్య మాటలయుద్ధం జరిగింది.

అనంతరం బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు అంబటి రాంబాబు. పేద ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసులను మంత్రి లోకేష్‌ పంపినట్టు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేద్దామని చూస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు అంబటి.

Show Full Article
Print Article
Next Story
More Stories