గుడివాడలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే రావి వ్యాపార సంస్థపై దాడి

Gudivada: కొడాలి నాని అనుచరుల పనేనని టీడీపీ ఆరోపణ

Jyothi
Updated on: 26 Dec 2022 7:31 AM IST
Tension in Gudivada Krishna District
X

 గుడివాడలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే రావి వ్యాపార సంస్థపై దాడి

Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే రావి వ్యాపార సంస్థపై దాడి చేశారు. అయితే కొడాలి నాని అనుచరుల పనేనంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రావి వెంకటేశ్వరరావుకు కాళీ అనే వ్యక్తి ఫోన్ చేసి దూషించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ కార్యకర్తలు కాళీ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పెట్రోల్ సంచులతో టీడీపీ శ్రేణులపై.. కొందరు దుండగులు దాడికి యత్నించారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య పోటాపోటీ నినాదాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Jyothi

Jyothi

Next Story