Anantapur : అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత

Anantapur: ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటి ముట్టడికి దళిత సంఘాల పిలుపు * కేతిరెడ్డి నివాసం దగ్గర భారీ భద్రత

Sandeep Eggoju
Published on: 25 March 2021 12:08 PM IST
Tension In Dharmavaram Anantapur District
X

Representational Image

Ananthapur: కలెక్టర్‌పై ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలు దళిత సంఘాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు పిలుపునిచ్చాయి. దీంతో కేతిరెడ్డి నివాసం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. కేతిరెడ్డి ఇంటికి వెళ్తోన్న ఆందోళనకారులను అడ్డుకుని అరెస్ట్ చేశారు.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల కలెక్టర్ గంధం చంద్రుడు ఓ పండగ నిర్వహణపై ఆంక్షలు విధించడంతో కేతిరెడ్డి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను లెక్కచేయడం లేదని మండిపడ్డారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story