Chittoor: చిత్తూరు జిల్లా కుప్పంలో కొనసాగుతున్న టెన్షన్

Chittoor: టీడీపీ అధినేత పర్యటనకు వెళ్లాల్సిన ప్రచార రథం, సౌండ్ వెహికిల్‌ను కుప్పంలోనే నిలిపివేసిన పోలీసులు

Jyothi
Updated on: 4 Jan 2023 12:57 PM IST
Tension in Chittoor District Kuppam
X

Chittoor: చిత్తూరు జిల్లా కుప్పంలో కొనసాగుతున్న టెన్షన్

Chittoor: చిత్తూరు జిల్లా కుప్పంలో కొనసాగుతున్న టెన్షన్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు వెళ్లాల్సిన ప్రచార రథాన్ని, సౌండ్ వెహికిల్‌ను కుప్పంలోనే పోలీసులు నిలిపేశారు. ప్రచార రథం డ్రైవర్‌ను కూడా అరెస్టు చేశారు. కుప్పం నుంచి శాంతిపురం వెళ్తున్న చైతన్యరథాన్ని, వాహనాలను పోలీసులు ఆపేశారు. శాంతిపురం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బయటకు వెళ్లడానికి లేదని ఆంక్షలు విధించారు. దీంతో టీడీపీ క్యాడర్‌లో కన్ఫ్యూషన్ నెలకొంది. చంద్రబాబు కోసం తరలి వస్తున్న కార్యకర్తలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. చిత్తూరు జిల్లా పెద్దూరు గ్రామం వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. కాగా మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు పెద్దూరుకు చేరుకోనున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు వెళుతున్నారు.


Jyothi

Jyothi

Next Story