అన్నమయ్య జిల్లాలో టెన్షన్.. టెన్షన్.. చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత

Chandrababu: అన్నమయ్య జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 4 Aug 2023 4:09 PM IST
Tension Grips at Annamayya District Amid Chandrababus Tour
X

అన్నమయ్య జిల్లాలో టెన్షన్.. టెన్షన్.. చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత

Chandrababu: అన్నమయ్య జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కురబలకోట మండలం అంగళ్లు కూడలి వద్దకు చంద్రబాబు చేరుకోగానే.. వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. చంద్రబాబు రోడ్ షోను అడ్డుకుంటామంటూ.. రోడ్డుపైకి వచ్చారు. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు.. లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో అంగళ్లు కూడలి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మరోవైపు.. భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story