శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత.. రోడ్లు మరమ్మత్తు పనులపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్

Andhra News: ధర్మవరం, పుట్టపర్తి రోడ్డ పనులపై పోటాపోటీ కార్యక్రమాలు

Jyothi
Published on: 1 Feb 2024 10:43 AM IST
Tension At Sri Sathya Sai District
X

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత.. రోడ్లు మరమ్మత్తు పనులపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్

Andhra News: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్మవరం, పుట్టపర్తి రోడ్డు మరమ్మతు పనులపై ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మధ్య సూర్యనారాయణ మధ్య వార్ నడుస్తోంది. పట్టణంలో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు వినతిపత్రం ఇచ్చానంటున్నారు సూర్యనారాయణ. ప్రభుత్వం స్పందించడంలేదని ఆయనే ఇవాళ గుంతలు పూడ్చే కార్యక్రమానికి రెడీ అయ్యారు.

అయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా నేడు అదే రోడ్డు పనులకు భూమి పూజ చేసేందుకు బయల్దేరారు. దీంతో ధర్మవరానికి పయనమైన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

Jyothi

Jyothi

Next Story