Pawan Kalyan - Rajahmundry Tour: రాజమండ్రిలో హై టెన్షన్ నెలకొంది

*రాజమండ్రి చేరుకున్న పవన్ కల్యాణ్ *సభకు అనుమతి ఉందంటున్న పోలీసులు *జనసేన కార్యకర్తలు, నేతల గృహ నిర్భంధం

Shilpa
Published on: 2 Oct 2021 1:00 PM IST
Tension at Pawan Kalyan Janasena Shramadanam Program in Rajahmundry
X

రాజమండ్రి చేరుకున్న పవన్ కల్యాణ్(ట్విట్టర్ ఫోటో)

Pawan Kalyan Rajahmundry Tour: రాజమండ్రిలో హై టెన్షన్ నెలకొంది. పవన్ శ్రమదానం పిలుపుతో రాజమండ్రి టెన్షన్ నెలకొంది. ఇప్పటికే రాజమండ్రికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి సభా ప్రాంగాణానికి పవన్ చేరుకుంటున్నారు ఆయనకు దారి పొడవునా స్వాగతం పలికారు అభిమానులు, జనసేన కార్యకర్తలు రాజమండ్రి హుకుంపేట నుంచి బాలాజీపేట రోడ్డు వరకు పవన్ శ్రమదానం చేయనున్నారు. అయితే సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు శ్రమదానంకు మాత్రం ఇవ్వలేదు

ఈ నేపథ్యంలో శ్రమదానం చేసి తీరుతామని జనసేన కార్యకర్తలు ప్రకటిస్తున్నారు. దాంతో సభ ప్రాంగణానికి చేరుకునే దారులన్నీ పోలీసులు మూసివేశారు. సభా ప్రాంగణానికి ఇరువైపులా 5 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు పెట్టారు. అంతేకాదు ఇప్పటికే జనసేన కార్యకర్తలు, నేతలను గృహనిర్భంధం చేశారు సభకు వెళ్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ లు చేస్తున్నారు. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు చెప్తున్నారు.

Shilpa

Shilpa

Next Story