Kurnool: కర్నూలు జిల్లా కోసిగి వద్ద ఉద్రిక్తత ..ట్రాక్టర్ ఢీ కొనడంతో రైల్వే గేట్ ధ్వంసం

Kurnool: పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

Shekhar G
Published on: 27 Aug 2023 11:58 AM IST
Tension At Kosigi Railway Gate In Kurnool District
X

Kurnool: కర్నూలు జిల్లా కోసిగి వద్ద ఉద్రిక్తత ..ట్రాక్టర్ ఢీ కొనడంతో రైల్వే గేట్ ధ్వంసం

Kurnool: కర్నూలు జిల్లా కోసిగిలో ఉన్న రైల్వే గేటును ట్రాక్టర్ ఢీకొట్టడంతో ధ్వంసం అయ్యింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోసిగి నుండి ఉరుకుంద వైపు బండల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ రైల్వే గేటును ఢీ కొనడంతో ఉరుకుంద ఈరన్నకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన రైల్వే గేటు దగ్గరకు చేరుకొని ట్రాఫిక్‌ను అతికష్టం మీద క్లియర్ చేశారు. అయితే రైల్వే గేట్ మ్యాన్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి.. కోసిగి స్టేషన్‌ మాస్టర్‌కు ఫిర్యాదు చేశారు. గేటు మ్యాన్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story