న్యూజిలాండ్‌లో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం.. 18 ఏళ్లకే పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక..

Gaddam Meghana: న్యూజిలాండ్‌లో తెలుగింటి అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది.

Arun Chilukuri
Published on: 16 Jan 2022 2:14 PM IST
న్యూజిలాండ్‌లో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం.. 18 ఏళ్లకే పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక..
X

న్యూజిలాండ్‌లో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం.. 18 ఏళ్లకే పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక..

Gaddam Meghana: న్యూజిలాండ్‌లో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన (18) న్యూజిలాండ్‌ దేశ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక అయ్యారు. తాజాగా ఆ దేశ నామినేటెడ్‌ ఎంపీ పదవుల ఎంపిక జరిగింది. దీనిలో భాగంగా 'సేవా కార్యక్రమాలు, యువత' విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌ సభ్యురాలిగా మేఘన ఎన్నికయ్యారు. వాల్కటో ప్రాంతం నుంచి ఆమె ఈ నామినేటెడ్ పదవీకి ఎంపికయ్యారు.

మేఘన తల్లిదండ్రులు గడ్డం రవికుమార్, ఉష. ఉద్యోగ రీత్యా రవికుమార్ 2001లో న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరిగిన మేఘన.. కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ ఉన్నత పాఠశాలలోనే తన విద్యాబ్యాసం పూర్తి చేశారు. తన చిన్న తనం నుంచే మేఘన సేవా కార్యక్రమాలు అలవర్చుకుంది. గత ఏడాది డిసెంబర్‌ 16న జరిగిన ఈ పార్లమెంట్‌ సభ్యురాలి ఎంపిక విషయాన్ని వాల్కటో ప్రాంత ప్రభుత్వ ఎంపీ టీమ్‌ నాన్‌ డమోలెస్‌ మేఘన కుటుంబానికి తెలిపారు. మేఘన ఫిబ్రవరిలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story