తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ మార్గాని భరత్

TTD: స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ మార్గాని భరత్

Arun Chilukuri
Updated on: 13 Sept 2021 1:11 PM IST
Telangana Minister Indrakaran Reddy and MP Margani Bharat Visited TTD
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరియు మార్గాన్ని భరత్ (ఫైల్ ఫోటో )

TTD: తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ మార్గాని భరత్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం‌ నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారికి 10 గ్రాముల బంగారం, వెండి సాలిగ్రామ హారాన్ని విరాళంగా ఇచ్చారు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణాలో‌ ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఇక ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగలను జరుపుకోవాలని ఎంపీ మార్గాని భరత్ కోరారు. ఏపీలో బీజేపి మత రాజకీయాలు చేయడం భాధాకరమన్నారు ఎంపీ భరత్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story