TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలు రాష్ట్రాల గవర్నర్లు

* స్వామి సేవలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళి సై * అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషీ

Shilpa
Published on: 14 Nov 2021 11:58 AM IST
Telangana Governor Tamilisai Soundararajan and Andaman and Nicobar Governor DK Joshi Visited TTD
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలు రాష్ట్రాల గవర్నర్లు(ఫైల్ ఫోటో)

TTD: తిరుమల శ్రీవారిని పలు రాష్ట్రాల గవర్నర్లు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అండమాన్ నికోబార్ లెఫ్టనెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషీలు వేరువేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ అధికారులు గవర్నర్లకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. సదరన్ జోనల్ మీటింగ్ కోసం తిరుపతికి వచ్చానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.

Shilpa

Shilpa

Next Story