Bandi Sanjay: సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

Bandi Sanjay: తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు.

Arun Chilukuri
Updated on: 17 Aug 2021 7:16 PM IST
Telangana BJP President Bandi Sanjay Write Letter To CM KCR
X

Bandi Sanjay: సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

Bandi Sanjay: తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణకు అన్యాయం జరగుతుందని తెలిపారు. కేఆర్ఎంబీ ఇటీవల అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించి మెజార్టీ పనులు పూర్తి చేసినట్టు రిపోర్టు సమర్పించినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని లేఖలో ఆరోపించారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా ఆ తర్వాత మొసలి కన్నీరు కారిస్తే ఏం లాభమని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ తో కలిసి తెలంగాణ ప్రజలతో వికృత క్రీడ ఆడుతున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్ కు లబ్ధిచేకూర్చేందుకే ఇరు రాష్ట్రాల సీఎంలు పని చేస్తున్నారని ఆరోపించారు. స్వార్ధపూరిత వైఖరి వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంటనే తెలంగాణ సీఎం సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story