Chittoor: దారుణం.. అల్లరి చేస్తుందని పుర్రె ఎముక చిట్లే విధంగా కొట్టిన టీచర్

Chittoor: దారుణం.. అల్లరి చేస్తుందని పుర్రె ఎముక చిట్లే విధంగా కొట్టిన టీచర్
x
Highlights

Teachers Brutality 6th Grade Girls Skull Fractured in Chittoor School

Chittoor: చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణంలో ఉన్న భాష్యం పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాల ఉపాధ్యాయుడు సలీం విద్యార్థినిని విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఆరో తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిని అల్లరి చేస్తోందని ఉపాధ్యాయుడు సలీం తలపై బ్యాగ్‌తో బలంగా కొట్టాడు. ఈ దాడిలో ఆ బాలిక పుర్రె ఎముక చిట్లిపోయినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన మదనపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు అక్కడ చికిత్స కొనసాగుతోంది.

ఈ ఘటనపై బాలిక తల్లి పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉపాధ్యాయుడి దాష్టీకంపై తల్లిదండ్రులు, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాఠశాల యాజమాన్యం కూడా ఈ ఘటనపై స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories