Vizianagaram: ఒక్క విద్యార్థితో నడుస్తున్నపాఠశాల

Teacher Teaching A Single Student In Vizianagaram District
x

Vizianagaram: ఒక్క విద్యార్థితో నడుస్తున్నపాఠశాల 

Highlights

Vizianagaram: గ్రామంలోని ప్రజలు వలస వెళ్లడంతో విద్యార్థినికి పాఠాలు..చెబుతున్న టీచర్

Vizianagaram: ఓ గ్రామంలో స్కూల్ ఉన్నా చదువుకునేందుకు విద్యార్థులు లేరు. ప్రస్తుతం ఆ గ్రామంలో చదువుకునే వయసున్న ఒకే ఒక విద్యార్థిని ఉండటంతో ఆ ఒక్క విద్యార్థికీ పాఠశాలలో ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తోంది. అసలు ఆ గ్రామంలో చదువుకునే వయసున్న పిల్లలు లేకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం..

విజయనగరం జిల్లా మెంటాడ మండలం సాకివలస గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో అభలసింగి గాయత్రి అనే ఓకే ఒక విద్యార్థిని చదువుతోంది. ప్రస్తుతం విద్యార్థిని నాలుగో తరగతి చదువుతోంది. గ్రామంలోని చాలామంది ప్రజలు కుటుంబ పోషణ కోసం వలస వెళ్లడంతో ఊర్లో చదువుకునే పిల్లలు లేరని గ్రామస్థులు చెబుతున్నారు. ఉపాధి పనుల కోసం అంతా పిల్లా పాపలతో వెళ్లడంతో అందరూ 50 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారని అంటున్నారు.

నిరుపేద కుటుంబానికి చెందిన గాయత్రి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి అదే గ్రామంలో ఉంటూ స్థానిక పాఠశాలలో తన కుమార్తెను చదివిస్తోంది. చదవుకునే విద్యర్థులెవరూ లేకపోవడంతో ఆ పాఠశాలలో ఉన్న ఒక్క విద్యార్థికే టీచర్ విజయలక్ష్మి పాఠాలు బోధిస్తోంది. బడి ఈడు పిల్లలు ఎవరూ లేకపోవడంతో గాయత్రికి మాత్రమే విద్యా బోధన చేస్తూ.. టీచర్ విధులు నిర్వహిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories