బాబు తన హయాంలో దొడ్డిదారిన ఆర్టీసీ ఛార్జీలు పెంచారు : మంత్రి పేర్ని నాని

బాబు తన హయాంలో దొడ్డిదారిన ఆర్టీసీ ఛార్జీలు పెంచారు : మంత్రి పేర్ని నాని
x
పేర్ని నాని
Highlights

ఆర్టీసీ ఛార్జీలపైనా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తన ఐదేళ్ల పాలనలో సెస్ అండ్ రౌండింగ్ పేరుతో పరోక్షంగా ఐదుసార్లు...

ఆర్టీసీ ఛార్జీలపైనా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తన ఐదేళ్ల పాలనలో సెస్ అండ్ రౌండింగ్ పేరుతో పరోక్షంగా ఐదుసార్లు ప్రయాణికులపై భారం మోపారని అన్నారు. ఒక్కసారి కూడా ఆర్టీసీ బస్సు ఎక్కని టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పేర్ని నాని ఫైరయ్యారు.

ఎస్సీ ఎస్టీ కమిషన్ విభజనపైనా కూడా టీడీపీ రాజకీయం చేసిందని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ విభజనకు శాసనసభలో చంద్రబాబు ఓకే చెబితే ఆయన కొడుకు లోకేష్ మాత్రం శాసనమండలిలో నో చెప్పడమేంటని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా మాదిగలను మోసం చేసిన చంద్రబాబు రాజకీయం కోసం మరోసారి ఎస్సీలతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories