చిత్తూరు జిల్లాలో నేతలకు అరుదైన అవకాశం.. మండలి రద్దు తీర్మానంతో తుడిచిపెట్టుకుపోతున్న టీడీపీ

చిత్తూరు జిల్లాలో నేతలకు అరుదైన అవకాశం.. మండలి రద్దు తీర్మానంతో తుడిచిపెట్టుకుపోతున్న టీడీపీ
x
చిత్తూరు
Highlights

రాజకీయాల్లో ఏ పని చేసినా కొందరికి మోదం మరికొందరికి ఖేదం అన్నట్లుంటుంది. కానీ, మండలి రద్దు మాత్రం అందరికీ బాధగానే మారింది. చిత్తూరు జిల్లాలో...

రాజకీయాల్లో ఏ పని చేసినా కొందరికి మోదం మరికొందరికి ఖేదం అన్నట్లుంటుంది. కానీ, మండలి రద్దు మాత్రం అందరికీ బాధగానే మారింది. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీలుగా ఉన్న ఐదుగురికి పదవులు ఊడనుండగా, ఆశతో ఎదురు చూస్తున్న ముగ్గురి ఆశలపై నీళ్లు చల్లేస్తోంది.

రాష్ర్టంలో ఏ జిల్లాకు లేని అరుదైన అవకాశం చిత్తూరు జిల్లాలో నేతలకు దక్కింది. నలుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, ఒక్కరు పిడిఎఫ్ కు చెందిన వారు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. మొన్న జరిగిన సాదారణ ఎన్నికల్లో ఒకే పార్టీ విజయ దుందుభి మోగించినా ఎమ్మెల్సీల రూపంలో ప్రతిపక్షం గట్టిగానే కనిపిస్తుంది. చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే గత ఎన్నికల్లో అందులో 13 నియోజకవర్గాలు వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రమే గెలిచారు. అయినా మండలి రూపంలో వారికి ఈ జిల్లా నుంచి మరో నలుగురు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో జిల్లా రాజకీయాల్లో అక్కడక్కడా తెలుగుదేశం పార్టీ ఉనికి కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా అసెంబ్లీలో మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానంతో జిల్లాలో ఐదేళ్ళ పాటు ఒక పార్టీ ప్రాతినిథ్యం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లుగా మారనుంది.

చంద్రబాబు సొంత జిల్లాలో ఎప్పుడూ తన పార్టీ ఆధిక్యాన్ని సాధించలేకపోతోంది. చంద్రబాబు పార్టీ అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి జిల్లా రాజకీయాల్లో ప్రస్పుటమవుతుంది. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ అదే ఫలితాలు వచ్చాయి. రాజకీయ సమీకరణలు మారి అప్పట్లో అమరనాధరెడ్డి పార్టీ మారడంతో ఒక సీటు ఆధిక్యాన్ని సాధించామన్న ఫీలింగ్ బాబుకు ఏర్పడింది. అదే సమయంలో ఎమ్మెల్సీల సంఖ్య ద్వారా జిల్లా రాజకీయాల్లో పార్టీని పటిష్టం చేయడం కోసం ప్రణాళికలు రూపొందించారు చంద్రబాబు. అందులో భాగంగానే స్థానిక సంస్థల కోటా నుంచి ఇద్దరికి మాత్రమే ఈ జిల్లాలో ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం ఉన్నా మరో ఇద్దరిని చంద్రబాబు ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. దీంతో నలుగురు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీకి అదనమయ్యారు.

గాలి సరస్వతమ్మ, రాజసింహులు స్థానిక సంస్థల నుంచి ఎన్నిక కాగా, ఎమ్మెల్యేల ద్వారా నారా లోకేష్, గవర్నర్ కోటా నుంచి గౌనివారి శ్రీనివాసులును ఎంపిక చేయడంతో పార్టీ పరపతి పెంచే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అప్పట్లో పెద్దగా ఉపయోగం లేకపోయినా గత ఎన్నికల్లో ఘోర పరాజయానికి గురైన చంద్రబాబుకు అప్పట్లో ఎమ్మెల్సీల రూపంలో వేసిన బీజం ఇప్పుడు బాగానే ఉపయోగపడింది. అయితే తాజాగా జరిగిన పరిణామాలు చంద్రబాబు చాణక్యానికి చమరగీతం పాడినట్లయ్యింది. మరో వైపు పిడిఎఫ్ నుంచి గ్రాడ్యుయేట్ కోటాలో గెలిచిన ఇదే జిల్లాకు చెందిన యండపల్లి శ్రీనివాసులు రెడ్డి భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారనుంది. వీరందరికీ 2023వ సంవత్సరం వరకు అవకాశం ఉన్నప్పటికీ తాజా నిర్ణయం వీరిని త్రిశంకు స్వర్గంలో పడేసింది.

శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు గత ఎన్నికల్లో టిడిపిని వీడి వైసిపిలోకి చేరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కావొచ్చని గట్టిగా విశ్వసించాడు. అయితే ఇప్పుడు మండలి రద్దుతో ఆయన భవితవ్యం గాల్లో దీపంగా మారింది. అలాగే పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన పోకల అశోక్ కుమార్ కు కూడా మండలికి వెళ్ళే ఆలోచన బలంగా ఉండేది, హామీ కూడా గట్టిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం అతనికీ చేజారింది.

మరో వైపు కుప్పంలో చంద్రబాబుకు పలు రూపాల్లో చెక్ పెడుతున్న వైసిపి నేతలు కుప్పంలో చంద్రబాబుపై ఓడిపోయిన చంద్రమౌళికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రోత్సహించాలనుకున్నారు. రెండు పర్యాయాలు ఓడిపోయిన ఆయనకు ఈ సారి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం ద్వారా పార్టీని బలోపేతం చేయడం, నాయకత్వాన్ని బలపరచడం కూడా జరుగుతుందని అనుకున్నారు. అయితే ఆయనకూ అ అవకాశం లేకపోకుండా పోయింది. దీంతో మండలి రద్దు నిర్ణయం చిత్తూరు జిల్లాలో చాలా మందికి పోటుగా మారింది. అయితే, టీడీపీ ఎమ్మెల్సీలు మాత్రం గట్టి ధీమాతో ఉన్నారు. మండలి రద్దు అంత ఈజీ కాదంటున్నారు. మరి మండలి రద్దు వ్యవహారం ఏమవుతుందో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories