AP Legislative Council: ఏపీ మండలిలో తగ్గనున్న టీడీపీ సభ్యుల సంఖ్య

AP Legislative Council: ఏపీలో 8 మంది ఎమ్మెల్సీల పదవికాలం నేటితో ముగియనుంది.

Arun Chilukuri
Published on: 18 Jun 2021 11:12 AM IST
TDP to Lose Majority in AP Legislative Council
X

AP Legislative Council: ఏపీ మండలిలో తగ్గనున్న టీడీపీ సభ్యుల సంఖ్య

AP Legislative Council: ఏపీలో 8 మంది ఎమ్మెల్సీల పదవికాలం నేటితో ముగియనుంది. కౌన్సిల్‌లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీలు 11కు చేరాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేయడంతో.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కానుంది. టీడీపీ నుంచి ఏడుగురికి, వైసీపీ నుంచి ఒక సభ్యునికి పదవీకాలం ముగియనుంది.

టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, వైసీబీ, బుద్దా వెంకన్న, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, ద్వారపురెడ్డి జగదీశ్వరరావు బుద్దా నాగ జగదీశ్వరరావులు పదవీవిరమణ చేయనున్నారు. ఇక మండలిలో వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రిటైర్‌కానున్నారు. కౌన్సిల్‌లో వైసీపీ సంఖ్యాబలం 21కి చేరగా టీడీపీ సభ్యుల సంఖ్య 15కి చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story