Jangareddigudem: జంగారెడ్డిగూడెంలో టీడీపీ బృందం పర్యటన

Jangareddigudem: *నాటుసారా బాధిత కుటుంబాలను పరమార్శించిన టీడీపీ నేతలు *టీడీపీ తరపున బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

Sriveni Erugu
Published on: 21 March 2022 6:21 PM IST
TDP Team Visits Jangareddygudem
X

Jangareddigudem: జంగారెడ్డిగూడెంలో టీడీపీ బృందం పర్యటన

Jangareddigudem: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ బృందం పర్యటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెంనాయుడు నేతృత్వంలో ఈ బృందంలో నిమ్మరామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గద్ధె రామ్మోహన్, ఆదిరెడ్డి భవానీ, మంతెన రామరాజు, అశోక్ బాబు. మాజీమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, పీతల సుజాత, పీతాని సత్యనారాయణతో ఉన్నారు. గ్రామానికి చేరుకున్నా టీడీపీ బృందానికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కల్తీసారా బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు టీడీపీ తరపున లక్ష రూపాలయ చొప్పున పరిహారం కింద ఆర్థిక సాయం అందజేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story