వీడిన పల్నాడు టీడీపీ నేత హత్య కేసు మిస్టరీ

వీడిన పల్నాడు టీడీపీ నేత హత్య కేసు మిస్టరీ
x

టీడీపీ నేత పురంశెట్టి అంకుల్  ఫైల్ Photo

Highlights

*రాజకీయ హత్య కాదని తేల్చిన పోలీసులు *వ్యక్తిగత గొడవలతోనే పురంశెట్టి అంకులు హత్య *సుపారీ ఇచ్చి హత్య చేయించిన ప్రత్యర్ధులు

పల్నాడులో తీవ్ర రాజకీయ దుమారం రేపిన టీడీపీ నేత పురంశెట్టి అంకులు హత్య కేసులో మిస్టరీ వీడింది. అంకులు మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు ఇది రాజకీయ హత్య కాదని తేల్చారు. భూములు, ఆస్తుల విషయంలో వ్యక్తిగత గొడవలతోనే పురంశెట్టి అంకులు హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. సుపారీ ఇచ్చిమరీ అంకులును ప్రత్యర్ధులు హత్య చేయించారని వెల్లడించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీసులు నిందితుల్లో నిషేధిత గ్రూపుల్లో పనిచేసిన వారున్నారని తెలిపారు.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఈనెల 3న టీడీపీ నేత అంకులు హత్యకు గురయ్యాడు. అయితే, వైసీపీ నేతలే అంకులును హత్య చేయించారని టీడీపీ నేత యరపతినేని సంచలన ఆరోపణలు చేశారు. దాంతో, అంకులు హత్యపై రాజకీయ దుమారం రేగింది. అయితే, అంకులు హత్యలో రాజకీయ కోణం లేదని పోలీసులు తేల్చేశారు. తెలిసినవారే పక్కా ప్లాన్‌తో అపార్ట్‌మెంట్‌కు పిలిచి సుపారీ గ్యాంగ్‌తో మర్డర్ చేయించారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories