ఇవాళ ఖమ్మంలో టీడీపీ బహిరంగ సభ

*హాజరుకానున్న పార్టీ అధినేత చంద్రబాబు

Jyothi
Updated on: 21 Dec 2022 7:42 AM IST
TDP Public Meeting in Khammam Today
X

ఇవాళ ఖమ్మంలో టీడీపీ బహిరంగ సభ

Khammam: తెలంగాణలో టీడీపీకి పూర్వం వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. రేపు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా‎ సభ ఏర్పాట్లను జిల్లా టీడీపీ నేతలు దగ్గరుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం పట్టణమంతా పసుపు మయంగా మారిపోయింది. హోర్డింగులు, పసుపు జెండాలు, తోరణాలతో నింపేశారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపి శ్రేణులు సిద్ధమయ్యాయి. ఖమ్మం బహిరంగ సభలో నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story