టీడీపీలో ఒకేరోజు ఇద్దరు సీనియర్ నేతలు మృతి.. లోకేష్ ఎమోషనల్ పోస్ట్!

టీడీపీలో ఒకేరోజు ఇద్దరు సీనియర్ నేతలు మృతి.. లోకేష్ ఎమోషనల్ పోస్ట్!
x
Highlights

టీడీపీ పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఒకే రోజు మృతి చెందారు. విజయవాడకు చెందిన టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆత్కూరి రవికుమార్, గోపర్తి నరసింహారావు కన్నుమూశారు.

టీడీపీ పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఒకే రోజు మృతి చెందారు. విజయవాడకు చెందిన టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆత్కూరి రవికుమార్, గోపర్తి నరసింహారావు కన్నుమూశారు. వారి మృతి పట్ల టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వారిని కోల్పోవడం పార్టీకి తీరని లోటని అన్నారు లోకేష్..

"విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు, మధురానగర్ మాజీ కార్పొరేటర్ ఆత్కూరి రవికుమార్ గారి ఆకస్మిక మరణం బాధాకరం. వారి మరణం పార్టీకి తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూన్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను." అని లోకేష్ ట్వీట్ చేశారు.

ఆలాగే "విజయవాడ తెలుగుదేశం నాయకులు, కృష్ణలంక మాజీ కార్పొరేటర్ గోపర్తి నరసింహారావు గారు కోవిడ్ మహమ్మారికి గురై మరణించడం బాధాకరం. వారి మరణం పార్టీకి తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను." అని లోకేష్ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories