చంద్రబాబు ముందే కేశినేని నాని అసహనం

Kesineni Nani: మీరే ఇవ్వండంటూ బొకేను నెట్టేసిన కేశినేని నాని

Jyothi
Published on: 6 Aug 2022 11:13 AM IST
TDP MP Kesineni Nani Shows his Anger in front of Party President Chandrababu
X

చంద్రబాబు ముందే కేశినేని నాని అసహనం 

Kesineni Nani: చంద్రబాబు ముందే కేశినేని నాని అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీకి చేరిన చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. బొకే ఇచ్చేందుకు ముందుకు రావాలని టీడీపీ నేతలు కోరగా మీరే ఇవ్వండంటూ బొకేను కేశినేని నాని నెట్టేశాడు. కేశినేని నాని చర్యతో టీడీపీ నేతల్లో అయోమయం నెలకొంది. చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో కేశినేని నాని అంటీముట్టనట్లుగా ఉన్నారు. ఇటీవల సోదరుడి వ్యవహారంపై కేశినేని నాని గుర్రుగా ఉన్నారు. తన సోదరుడిని ఉసిగొల్పుతున్నారని కేశినేని నాని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో లుకలుకలు స్పష్టంగా బయటపడ్డాయి.

Jyothi

Jyothi

Next Story